గాయంతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో యువ ఆటగాడు ఆయుష్ బదోనీకి భారత వన్డే జట్టులో చోటు దక్కడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఎంపికపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో కనీసం 1000 పరుగులు కూడా చేయని ఆటగాడికి జాతీయ జట్టులో చోటు ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Read Also: WPL 2026: గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి
ఎంపికపై వివరణ
అయితే, రియాన్ పరాగ్, రింకూ సింగ్ వంటి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను కాదని బదోనీని ఎంపిక చేయడంపై అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో భారత జట్టు (Team India) బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ఈ ఎంపికపై వివరణ ఇచ్చాడు.రాజ్‌కోట్‌లో రెండో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన కోటక్ జట్టుకు ఆరో బౌలింగ్ ఆప్షన్ చాలా అవసరమని పేర్కొన్నాడు. “వాషింగ్టన్ సుందర్ గాయపడినప్పుడు కేవలం ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగడం రిస్క్ అవుతుంది.
మొదటి వన్డేలో సుందర్ నాలుగైదు ఓవర్ల తర్వాత గాయపడితే, మిగతా ఓవర్లు ఎవరు వేస్తారు? అందుకే ప్రతీ జట్టుకు ఆరో బౌలర్ అవసరం. బదోనీ బ్యాటింగ్‌తో పాటు ఉపయోగకరమైన ఆఫ్-స్పిన్ బౌలింగ్ చేయగలడు” అని తెలిపాడు.ఇండియా-ఎ తరఫున, ఐపీఎల్‌లో బదోనీ నిలకడగా రాణించాడని కోటక్ గుర్తుచేశాడు. “అతడు ఇండియా-ఎ తరఫున కొన్ని హాఫ్ సెంచరీలు చేశాడు. వైట్-బాల్ క్రికెట్‌లో బదోని ప్రదర్శన బాగుంది. అవసరమైనప్పుడు మూడు, నాలుగు ఓవర్లు వేయగల సామర్థ్యం అతనికి ఉంది. అందుకే సెలెక్టర్లు అతడి వైపు మొగ్గు చూపారు” అని కోటక్ వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: