📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Latest News: Tazmin Brits: చాలా సార్లు ఆత్మహత్యాయత్నం చేశా: స్టార్ క్రికెటర్

Author Icon By Aanusha
Updated: October 10, 2025 • 6:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సౌతాఫ్రికా మహిళా క్రికెటర్ టాజ్మిన్ బ్రిట్స్ తన జీవితంలోని అనూహ్య సంఘటనల గురించి వ్యక్తిగతంగా చెప్పిన విషయాలు అభిమానులను, క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచాయి. వన్డే ప్రపంచకప్ 2025 (ODI World Cup 2025) లో భారత్ వేదికగా జరగుతున్న ఈ టోర్నీ సమయంలో, ఆమె అసాధారణ ప్రదర్శనతో ఆటలో తన ప్రావీణ్యం చూపిస్తోంది. అయితే, ఈ విజయానికి వెనుక ఉన్న కథ చాలానే స్ఫూర్తిదాయకంగా ఉంది.

IPL 2026: ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్

జీవితంలో ఎదురైన అనూహ్య ఘటనతో చచ్చిపోవాలనుకున్నానని, పలుమార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశానని సౌతాఫ్రికా మహిళా ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ తెలిపింది. 2011లో జరిగిన కారు ప్రమాదంతో తన జీవితం ఒక్కసారిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.భారత్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాజ్మిన్ బ్రిట్స్(0) విఫలమైనా..

న్యూజిలాండ్‌పై భారీ శతకం సాధించింది. గత 6 వన్డేల్లో 4 సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉంది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా ఏడు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా మెగ్ లానింగ్‌తో సహా పలు రికార్డులను బద్దలుకొట్టింది. అయితే టాజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits) క్రికెట్ జర్నీ విభిన్నమైనది.వాస్తవానికి ఆమె అథ్లెటిక్స్ కెరీర్‌ను ఎంచుకుంది.

Tazmin Brits

జావెలిన్ త్రోయర్‌గా 2012 లండన్ ఒలింపిక్స్‌కు సిద్దమైంది. 16 ఏళ్ల వయసులోనే ప్రపంచ అథ్లెటిక్స్ యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించింది. 2010 అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. కానీ లండన్ ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు బ్రిట్స్ ఘోర కారు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హిప్,పెల్విస్ ఎముకలు విరిగిపోయాయి.

దాంతో ఆమె రెండు నెలల పాటు ఆసుపత్రిలోనే గడపాల్సి వచ్చింది. ఈ ప్రమాదం కారణంగా తన ఒలింపిక్ కల చెదిరింది. రోడ్డు ప్రమాదంలో అచేన స్థితిలో ఉన్న ఆమెను చూసి నడవడం కూడా కష్టమని అంతా అనుకున్నారు. కానీ ఓ స్నేహితుడి సూచనతో సరదాగా క్రికెట్ ఆడటం ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత కెరీర్‌గా ఎంచుకుంది.

రోడ్డు ప్రమాదంతో నా జీవితం పూర్తిగా మారిపోయింది

2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి పరుగుల మోత మోగిస్తుంది. తాజాగా మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా (Anjum Chopra) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురైంది.’రోడ్డు ప్రమాదంతో నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ రోజులను తలుచుకోవడమే కష్టంగా ఉంది.

ఆ బాధను భరించలేక చచ్చిపోవాలనుకున్నాను. పలుమార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. నిరంతరం నన్ను ఆత్మహత్య ఆలోచనలు వెంటాడేవి. కానీ నాకు నా తల్లిదండ్రులు అండగా నిలిచారు. ముఖ్యంగా మా అమ్మ నేను కోలుకోవడంలో కీలక పాత్ర పోషించింది. అయితే అది అంత సులువుగా జరగలేదు.

నార్త్ వెస్ట్ క్రికెట్ కోచ్

ఓ రోజు నేను బార్‌లో కూర్చున్నప్పుడు నార్త్ వెస్ట్ క్రికెట్ కోచ్.. మహిళా క్రికెటర్ల కోసం వెతుకుతూ మా వైపు వచ్చాడు. నా ఫ్రెండ్స్ వెంటనే నేను క్రికెట్ (Cricket) ఆడుతానని ఆయనతో చెప్పారు. ఆ సమావేశం నా జీవితాన్ని మలుపు తిప్పింది. అయితే క్రికెట్‌లోకి వచ్చే ముందు నేను మళ్లీ జావెలిన్ త్రోయర్‌గా రాణించేందుకు ప్రయత్నించాను.

కానీ ఆ దేవుడు నా విధిరాతలో క్రికెటర్ కావాలని రాసాడేమో.. అందుకే జావెలిన్ త్రోయర్ కావాల్సిన నేను క్రికెటర్ అయ్యాను.’అని టాజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits) చెప్పుకొచ్చింది. జీవితంలో ప్రతీ ఒక్కరికి రెండో ఛాన్స్ లభిస్తుందని, ఆ అవకాశం కోసం ఎదురు చూడాలని బ్రిట్స్ జీవిత ప్రయాణం సూచిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

latest news South Africa women cricketer Tazmin Brits Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.