T20World Cup2026: టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లినప్పటికీ, టీమ్ ఇండియా ఆటతీరుపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ సాధిస్తున్న విజయాలు కేవలం అదృష్టం వల్ల వచ్చినవే తప్ప, జట్టు సమష్టి కృషితో ఆధిపత్యం ప్రదర్శించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రూప్ దశ నుండి నాకౌట్ వరకు భారత్ ఆడిన తీరులో ఎక్కడా ఛాంపియన్ లక్షణాలు కనిపించలేదని అక్తర్ విమర్శించారు.
Read Also:T20 World Cup2026: పాక్ ఆటగాళ్లపై పీసీబీ కొరడా: ఒక్కొక్కరికి రూ. 50 లక్షల జరిమానా!
షోయబ్ అక్తర్ తన విశ్లేషణలో భాగంగా.. భారత్ గెలిచిన మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్లు క్యాచ్‌లు జారవిడవడం లేదా ఎవరో ఒక ఆటగాడు వ్యక్తిగత మెరుపులు మెరిపించడం వల్లే గట్టెక్కిందని పేర్కొన్నారు. ఒక శక్తిమంతమైన జట్టుగా ప్రత్యర్థిని పూర్తిగా అణచివేసే ప్రదర్శన భారత్ నుండి రాలేదని ఆయన అన్నారు. టీమ్ ఇండియా సెమీస్‌కు చేరినప్పటికీ, వారి ఆటతీరులో నిలకడ లేదని అక్తర్ కుండబద్దలు కొట్టారు.
మరోవైపు, ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టు ప్రదర్శనను అక్తర్ ఆకాశానికెత్తారు. ప్రస్తుతం ఉన్న జట్లన్నింటిలో ప్రోటీస్ జట్టు మాత్రమే నిజమైన ఛాంపియన్ తరహాలో ఆడుతోందని ఆయన కొనియాడారు. మైదానంలో వారు చూపిస్తున్న దూకుడు, సమష్టి పోరాటం చూస్తుంటే ఈసారి ప్రపంచకప్ గెలిచే పూర్తి అర్హత దక్షిణాఫ్రికాకే ఉందని అక్తర్ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: