T20WC 2026: ఆసీస్ ఎలిమినేషన్‌పై రికీ పాంటింగ్ ఏమన్నారంటే?

Read Time:  1 min
T20WC 2026: ఆసీస్ ఎలిమినేషన్‌పై రికీ పాంటింగ్ ఏమన్నారంటే?
FONT SIZE
GET APP

T20WC 2026: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియా జట్టు అనూహ్యంగా గ్రూప్ దశలోనే నిష్క్రమించడం ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా ఈ టోర్నీలో కనీస స్థాయిలోనూ రాణించలేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ పరాజయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ఘాటుగా స్పందించారు. ఇటీవల ఐసీసీ రివ్యూ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఆస్ట్రేలియా ప్రదర్శనను తీవ్రంగా తప్పుబట్టారు.

Read Also: IND vs NED: టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

టాప్ ఆర్డర్ వైఫల్యం కూడా ఓటమికి కారణం

“ఇది నిజంగా చాలా నిరాశాజనకమైన టోర్నీ. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం, సరైన సమయానికి ఫామ్ రాకపోవడం జట్టును దెబ్బతీశాయి. ముఖ్యంగా జింబాబ్వేతో ఓటమి వరల్డ్ కప్ నుంచి బయటపడటానికి ప్రధాన కారణం” అని పాంటింగ్ తెలిపారు.శ్రీలంకతో మ్యాచ్‌ కూడా ఆస్ట్రేలియాకు కీలకంగా మారిందన్నారు. “శ్రీలంక తమ గడ్డపై అద్భుతంగా ఆడింది. ఆ మ్యాచ్‌లో ఛేజ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ జింబాబ్వే చేతిలో ఓడిపోవడం అస్సలు అంగీకరించలేం” అని వ్యాఖ్యానించారు.“కాగితాల మీద చూస్తే ఈ జట్టుకు ఆ ప్రత్యేకమైన మెరుపు లేదు.

T20WC 2026: What did Ricky Ponting say about Aussies' elimination?
T20WC 2026: What did Ricky Ponting say about Aussies’ elimination?

పెద్ద టోర్నీల్లో అనుభవజ్ఞులు ముందుకు వచ్చి మ్యాచ్‌లు గెలిపించాలి. కానీ ఈసారి అది జరగలేదు” అని అన్నారు. టాప్ ఆర్డర్ వైఫల్యం కూడా ఓటమికి కారణమని పాంటింగ్ పేర్కొన్నారు. “ముఖ్యంగా నెంబర్ 3, నెంబర్ 4 స్థానాల్లో సరైన ప్రదర్శన లేదు. తొలి వికెట్లు త్వరగా పడిపోవడంతో జట్టు ఒత్తిడిలోకి వెళ్లింది” అని విశ్లేషించారు.“మా జట్లకు ఎప్పుడూ వరల్డ్ కప్ గెలవడమే ప్రధాన లక్ష్యం. కానీ ఈసారి కీలక ఆటగాళ్లు నిలబడలేదు. అందుకే టైటిల్ దూరమైంది” అని పాంటింగ్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.