📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్

T20 World Cup warm-up: సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

Author Icon By Aanusha
Updated: February 5, 2026 • 12:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో బుధవారం జరిగిన టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌ (T20 World Cup warm-up) లో సౌతాఫ్రికాను 30 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (53), తిలక్ వర్మ (45), హార్దిక్ పాండ్యా (30) రాణించారు. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అర్షదీప్ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.

Read Also: ICC T20 ranking list : ఐసీసీ ర్యాంకింగ్స్ షాక్, ఇషాన్ కిషన్ 32 స్థానాలు జంప్!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(20 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. తిలక్ వర్మ(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) తన జోరు కొనసాగించగా.. అక్షర్ పటేల్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) దూకుడుగా ఆడాడు.ధాటిగా ఆడే క్రమంలో రింకూ సింగ్(13బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 16), ఔటవ్వగా.. హార్దిక్ పాండ్యా(10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) చెలరేగాడు.

ఎయిడెన్ మార్క్‌రమ్

అభిషేక్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్, కార్బినో బోష్, అన్రిచ్ నోర్జ్, మఫకా తలో వికెట్ తీసారు. అనంతరం సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఎయిడెన్ మార్క్‌రమ్(19 బందుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38), ర్యాన్ రికెల్టన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), జాసన్ స్మిత్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35),

T20 World Cup warm-up: Team India’s massive win over South Africa

ట్రిస్టన్ స్టబ్స్(21 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 45 నాటౌట్), మార్కో జాన్సెన్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) రాణించారు.భారత బౌలర్లలో అభిషేక్ శర్మ(2/32) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరంగా ఉన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌, ఫీల్డింగ్ పరంగా టీమిండియా ప్రాక్టీస్ అదిరింది. భారత్ ధాటికి మరోసారి సౌతాఫ్రికా వణికింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

DY Patil Stadium latest news Mumbai T20 World Cup warm-up Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.