T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జింబాబ్వేతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), సీనియర్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ చెన్నైలోని ప్రసిద్ధ మారుండీశ్వరర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సెమీఫైనల్ రేసులో బలంగా నిలిచే అవకాశం ఉండటంతో, ఆటగాళ్లు ప్రత్యేక పూజలు నిర్వహించి శివుడి ఆశీస్సులు తీసుకున్నారు.
Read Also: New Zealand vs Zimbabwe: న్యూజిలాండ్ వేదికగా కివీస్-జింబాబ్వే పోరు!
మనోబలం కోసం ఆధ్యాత్మిక ప్రార్థనలు
ప్రస్తుత టోర్నీలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. గత కొద్ది రోజులుగా కడుపు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన శారీరకంగా, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందేందుకు, తన అనారోగ్యం నుండి కోలుకుని జట్టుకు విజయాన్ని అందించాలనే సంకల్పంతో ఆయన ఆలయాన్ని దర్శించినట్లు సమాచారం. విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్న వేళ, ఆటగాళ్ల ఈ ఆలయ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: