T20 World Cup 2026: రేపే T20 ప్రపంచకప్ జట్టు ప్రకటన!

Read Time:  1 min
T20 World Cup 2026
T20 World Cup 2026
FONT SIZE
GET APP

టీ20 ప్రపంచకప్‌ 2026 (T20 World Cup 2026) కోసం భారత జట్టును శనివారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా సూర్య, వైస్ కెప్టెన్‌గా గిల్‌ను కొనసాగించనున్నారు. సౌతాఫ్రికా, సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో నుంచి ఒకరిద్దరిని తొలగించి వారి స్థానంలో ఇషాన్ కిషన్, పంత్, అయ్యర్, రింకూ, జురెల్‌‌కు చోటు కల్పించే అవకాశాలున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అయితే సూర్య, గిల్ ఫామ్‌ ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నాయి.

Read Also: FIFA: ఫిఫా వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు

తీవ్ర సందిగ్ధత

మరోవైపు అద్భుతమైన రికార్డు ఉన్న యశస్వి జైస్వాల్‌కు మళ్లీ అవకాశం దక్కుతుందా? లేదా? అన్నది చూడాలి. వికెట్ కీపర్ల స్థానంపై కూడా తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఆసియా కప్ నుంచి సంజూ శాంసన్, జితేష్ శర్మలను కొనసాగిస్తున్నప్పటికీ, జితేశ్‌ ఒక్క ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడలేదు.

T20 World Cup team announcement tomorrow!
T20 World Cup team announcement tomorrow!

సంజూ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసి చివరకు తుది జట్టు నుంచి తప్పించారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. టోర్నీకి ముందు భారత్, న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ప్రపంచకప్‌ (T20 World Cup 2026) లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.