ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 (T20 World Cup) నేపథ్యంలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలన్న పాకిస్థాన్ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఎలాగూ శ్రీలంకలో ఆడుతున్నప్పుడు ఇబ్బందేంటని ప్రశ్నించారు. అసలు దేనికోసం ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. పాకిస్థాన్ ఇలా వెనక్కి తగ్గడం నన్ను ఆశ్చర్యపరిచింది.వరల్డ్ కప్‌లో ప్రతీ పాయింట్ ముఖ్యమేనని హితవు పలికారు.
Read Also: Scotland vs Italy: టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న ఇటలీ
పాకిస్థాన్ ఆడకపోవడాన్ని ఆయన తప్పుబట్టాడు
పాకిస్థాన్ ఇలా వెనక్కి తగ్గడం నన్ను ఆశ్చర్యపరిచింది అని స్పష్టం చేశాడు. తటస్థ వేదికపై మ్యాచ్ జరుగుతున్నప్పటికీ పాకిస్థాన్ ఆడకపోవడాన్ని ఆయన తప్పుబట్టాడు.ఈ టోర్నమెంట్ కోసం భారత్‌కు వెళ్లకూడదని బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా, టీమిండియాతో తమ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. గ్రూప్-ఏలో ఉంది. ఇదే గ్రూపులో పాకిస్థాన్‌తో పాటు నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్‌ఏ జట్లు కూడా ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: