📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

T20 World Cup: అమెరికాపై పాకిస్థాన్ ఘన విజయం

Author Icon By Aanusha
Updated: February 10, 2026 • 11:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup) టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టు మరో, విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే నెదర్లాండ్స్‌పై అతి కష్టంగా గెలుపొందిన పాకిస్థాన్.. రెండో మ్యాచ్‌లో సమష్టిగా ఆధిపత్యం చెలాయించింది. గ్రూప్-ఏలో భాగంగా కొలంబో వేదికగా అమెరికాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

Read Also: Ind vs Pak : 10 రోజుల్లో యూటర్న్, భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ఓకే!

T20 World Cup: Pakistan’s massive win over America

పరుగులు సాధించడం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (41 బంతుల్లో 73 పరుగులు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా, బాబర్ ఆజమ్ (32 బంతుల్లో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో షాదాబ్ ఖాన్ (12 బంతుల్లో 30) వేగంగా పరుగులు సాధించడంతో పాక్ భారీ స్కోరు చేయగలిగింది. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్క్‌విక్ 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా గట్టిగానే పోరాడింది. శుభమ్ రంజానె (30 బంతుల్లో 51), షయాన్ జహంగీర్ (34 బంతుల్లో 49) అద్భుతంగా రాణించారు. అయితే, కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో లక్ష్యానికి దూరమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్ 3 వికెట్లు తీయగా, షాదాబ్ ఖాన్ 2 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. అంతకుముందు టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ICC latest news PakistanCricket T20WorldCup2026 Telugu News USAcricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.