T20 World Cup: కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం

Read Time:  1 min
T20 World Cup: కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం
FONT SIZE
GET APP

T20 World Cup: చెన్నై వేదికగా జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు కెనడాపై ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది.

Read Also: Shoaib Akhtar: నేను అలా అనలేదు

T20 World Cup: New Zealand wins big against Canada
T20 World Cup: New Zealand wins big against Canada

కెనడా పోరాటం..

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా(New Zealand vs Canada) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కెనడా బ్యాటర్ యువరాజ్ సమ్రా అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తూ 110 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు భారీ స్కోరుకు పునాది వేశాడు.

న్యూజిలాండ్ సునాయాస విజయం

174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కెనడా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. చాలా వేగంగా ఆడిన కివీస్ బ్యాటర్లు, కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని మ్యాచ్‌ను ముగించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.