T20 World Cup: అఫ్గాన్‌పై న్యూజిలాండ్‌ విజయం

Read Time:  1 min
T20 World Cup: అఫ్గాన్‌పై న్యూజిలాండ్‌ విజయం
FONT SIZE
GET APP

చెన్నై వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2026 (T20 World Cup) మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు అఫ్గానిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.న్యూజిలాండ్‌ బ్యాటర్లలో టిమ్‌ సీఫెర్ట్‌ (65) అర్ధశతకం చేయగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (42), మార్క్‌ చాప్‌మన్‌ (28), డారిల్‌ మిచెల్‌ (25 నాటౌట్‌) రాణించారు.అఫ్గానిస్థాన్‌ బౌలర్లలో ముజీబ్‌ రెహమాన్‌ 2, ఒమర్జాయ్‌, రషీద్‌ ఖాన్‌, మహమ్మద్‌ నబీ ఒక్కో వికెట్‌ తీశారు.

Read Also: Abhishek Sharma: టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్‌ దూరం

T20 World Cup: New Zealand win over Afghanistan
T20 World Cup: New Zealand win over Afghanistan

న్యూజిలాండ్‌ బౌలర్లలో

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుల్బాదిన్‌ నబీ (63) అర్ధశతకం బాదాడు. సెదిఖుల్లా అటల్ ‌(29), రెహమానుల్లా గుర్బాజ్ ‌(27), దార్విస్‌ రసూలీ (20) తమ వంతు ప్రయత్నం చేశారు. మూడో వికెట్‌కు అటల్‌, గుల్బాదీన్‌ కలిసి 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో ఒమర్జాయ్ ‌(14) రనౌటయ్యాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ 2 వికెట్లు తీయగా.. హెన్రీ, డఫి, రచిన్‌ రవీంద్ర తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.