T20 World Cup: సిద్ధీవినాయకుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు

Read Time:  1 min
T20 World Cup: సిద్ధీవినాయకుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు
FONT SIZE
GET APP
T20 World Cup: సిద్ధీవినాయకుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup) టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్న టీమిండియా, శుభారంభం కోసం దైవాన్ని ప్రార్థించింది. శనివారం నాడు అమెరికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు విజయాన్ని కాంక్షిస్తూ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మరికొందరు సహాయక సిబ్బందితో కలిసి ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయక గణపతి (Shri Siddhivinayak Ganapati) ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Read Also: T20 WC: ఆ విషయంలో పాక్ ఎప్పుడైనా యూటర్న్ తీసుకోవచ్చు: ఇర్ఫాన్ పఠాన్

కీలకమైన మ్యాచ్‌లకు ముందు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కోసం వారు దైవాన్ని ఆశ్రయించారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు, ఈ ప్రార్థనలు తమకు సానుకూల ఫలితాలు ఇస్తాయని ఆశిస్తోంది. (T20 World Cup) టైటిల్ నిలబెట్టుకునే ప్రయాణంలో యూఎస్‌ఏపై విజయంతో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. ఈ ఆలయ సందర్శనంతో టీమిండియా ఆటగాళ్లలో కొత్త ఉత్సాహం నిండింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.