IND vs USA result : T20 WC టీమిండియా కొత్త రికార్డు, 9 వరుస విజయాలు!

Read Time:  1 min
IND vs USA result
IND vs USA result
FONT SIZE
GET APP

IND vs USA result : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా ఘనంగా ఆరంభించింది. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత అర్ధశతకంతో జట్టును ఆదుకోగా, బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ప్రత్యర్థిని కట్టడి చేశారు.

ఈ విజయంతో భారత జట్టు టీ20 ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. వరుసగా తొమ్మిది విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. అంతేకాదు, వన్డేలు–టీ20లు కలిపి ప్రపంచకప్‌లలో మొత్తం 100 విజయాలు సాధించిన రెండో జట్టుగా భారత్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ ఘనత సాధించిన తొలి జట్టు ఆస్ట్రేలియా (108 విజయాలు) కావడం విశేషం.

Read Also: Soil testing : భూసార పరిరక్షణతోనే సాగు ముందడుగు

IND vs USA result
IND vs USA result

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అమెరికా బౌలర్ల దాటికి తడబడింది. ఒకే ఓవర్‌లో ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25), శివమ్ దూబే (0) వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్లకే 6 వికెట్లు పడిపోవడంతో భారత్ ఒత్తిడిలో పడింది. అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్ (4/25) భారత బ్యాటింగ్‌ను కుదిపేశాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ ఎదురుదాడికి దిగుతూ 49 బంతుల్లో 84 పరుగులు చేసి స్కోరును 9 వికెట్లకు 161 పరుగుల వరకు చేర్చాడు.

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాను భారత బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. మిలింద్ కుమార్ (34), శుభమ్ రంజనే (37), సూరజ్ కృష్ణమూర్తి (37) పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. అర్ష్‌దీప్ సింగ్ (2/18), మహ్మద్ సిరాజ్ (2/29), అక్షర్ పటేల్ (2/24) రాణించడంతో అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ టోర్నీని విజయంతో ప్రారంభించింది..

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.