📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 WC: నేటి నుంచి టీ20 ప్రపంచకప్

Author Icon By Anusha
Updated: February 7, 2026 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026 (T20 WC) ఇవాళ్టి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల చూపంతా ఈ మెగా టోర్నీపై ఉంది.. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తోంది. కొలంబో వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, అమెరికా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది.. ఈ మ్యాచ్‌కు ముందు టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభిస్తూ అట్టహాసంగా ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నారు.

Read Also: T20 World Cup 2026: మొదటి మ్యాచ్‌కు జస్‌ప్రీత్‌ బుమ్రా దూరం

వేడుకల్లో ప్రముఖులు

టోర్నమెంట్ ట్రోఫీని ఐసీసీ చైర్మన్ జై షా, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకొస్తారు. టోర్నీలో పాల్గొంటున్న 20 దేశాలకు ప్రతీకగా 20 మంది చిన్నారులు వారితో జతకలవనున్నారు. అనంతరం అందరూ కలిసి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ సింగర్, ర్యాపర్ బాద్‌షా తన పాటలతో, ప్రముఖ డ్యాన్సర్ నోరా ఫతేహీ తన డ్యాన్స్‌తో అలరించనున్నారు. చివరగా ఇద్దరూ కలిసి ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.

అలాగే శివ‌మ‌ణి, రిష‌భ్ రిఖిరామ్ శ‌ర్మల ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా ఉంటాయి. మైదానం మధ్యలో టోర్నీ అధికారిక లోగోను వేదికగా మార్చి ప్రదర్శనలు నిర్వహిస్తారు. కార్యక్రమం ముగింపులో అద్భుతమైన పైరోటెక్నిక్ ప్రదర్శన (బాణసంచా) ఉంటుంది. అయితే, ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యక్ష ప్రసారం గానీ, లైవ్ స్ట్రీమింగ్ గానీ ఉండవని నిర్వాహకులు స్పష్టం చేశారు. కేవలం భారత్-యూఎస్‌ఏ మ్యాచ్ టికెట్లు ఉన్నవారు మాత్రమే స్టేడియంలో దీనిని ప్రత్యక్షంగా వీక్షించగలరు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ICC Men’s T20 World Cup 2026 latest news Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.