టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు టోర్నీ ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్, కీలక ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా, మార్ష్‌కు గజ్జల్లో బంతి బలంగా తగలడంతో అతను అంతర్గత రక్తస్రావంతో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ గాయం కారణంగా నేడు జరగనున్న ఐర్లాండ్‌తో కీలకమైన మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు.
Read Also: T20 WC: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. విమాన టిక్కెట్ ధరలకి రెక్కలు
త్వరలోనే చెప్తాం
అతని స్థానంలో ట్రావిస్ హెడ్ తాత్కాలికంగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.ఈ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన విడుదల చేసింది. “మార్ష్‌కు తీవ్రమైన నొప్పి, అసౌకర్యం ఉన్నాయి. కదలడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. స్కానింగ్‌లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు నిర్ధారణ అయింది. అతనికి కొంతకాలం విశ్రాంతి అవసరం. లక్షణాలు తగ్గిన తర్వాత, వైద్యుల సలహా మేరకు అతను తిరిగి ఎప్పుడు ఆడతాడో నిర్ణయిస్తాం” అని తెలిపింది. ఇప్పటికే హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ వంటి కీలక బౌలర్లు గాయాలతో దూరం కాగా, ఇప్పుడు కెప్టెన్ మార్ష్ గాయపడటం ఆస్ట్రేలియాను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.