📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

T20 World Cup: కొత్త డిమాండ్‌తో ఐసీసీ ముందుకు బంగ్లాదేశ్?

Author Icon By Anusha
Updated: January 4, 2026 • 1:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్, భారత్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇప్పుడు క్రీడారంగంపై, తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 2026 టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) లో భాగంగా భారత్‌లో జరగాల్సిన తమ మ్యాచ్‌ల వేదికను మార్చాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని కోరుతూ ఐసీసీకి అధికారికంగా లేఖ రాయాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ను ఆదేశించింది.

Read also: Mustafizur Rahman: KKR తప్పించడంపై ముస్తాఫిజుర్ ఏమన్నారంటే?

బీసీసీఐ తలొగ్గి ఈ నిర్ణయం

ఈ పరిణామం ఇరు దేశాల క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముస్తాఫిజుర్ రెహమాన్ విడుదల.. బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తన స్క్వాడ్ నుంచి విడుదల చేసింది.బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కొన్ని మతతత్వ శక్తుల ఒత్తిడికి బీసీసీఐ తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది.

T20 World Cup: Bangladesh approaches ICC with new demand?

భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదని వారు వాదిస్తున్నారు. ఈ వరుస పరిణామాలు ఐపీఎల్ ప్రసారాలపై ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నాయి.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ ఫిబ్రవరి 7న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో తమ ప్రపంచకప్ ప్రస్థానాన్ని ప్రారంభించాల్సి ఉంది.ఈ వివాదంపై బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది చాలా విచారకరమైన సంఘటన. ముస్తాఫిజుర్ కేకేఆర్‌లో ఆడుతుంటే మేమంతా ఆ జట్టుకు మద్దతు ఇచ్చేవాళ్లం. బీసీసీఐ చర్య మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది” అని బీసీబీ మాజీ డైరెక్టర్ ఖలీద్ మహమూద్ అన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

latest news s: India Bangladesh cricket T20 World Cup 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.