రానున్న టీ20 ప్రపంచకప్‌కు అధికారిక గీతాన్ని ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) స్వరపరచనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీతో తన పేరు అనుసంధానమవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని అనిరుధ్ అన్నారు. క్రికెట్ తనకు కేవలం ఒక ఆట మాత్రమే కాదని, కోట్లాది మంది అభిమానుల భావోద్వేగాలతో ముడిపడిన అనుభూతి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచకప్ కోసం పాట అందించే అవకాశం రావడం ప్రత్యేకమైన అనుభవమని పేర్కొంటూ, ఈ గీతాన్ని త్వరలోనే అభిమానుల ముందుకు తీసుకువస్తామని వెల్లడించారు.
Read Also: Team India: పాక్ రికార్డును బద్దలుకొట్టిన భారత్
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా స్వదేశంలో మ్యాచ్‌లు ఆడనుండటంతో టైటిల్‌కు ప్రధాన ఫేవరెట్‌గా కనిపిస్తోంది. సొంత మైదానాల్లో మరోసారి కప్ సాధించి అభిమానులను ఉత్సాహపరచాలనే లక్ష్యంతో సూర్యసేన కఠినంగా సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అనిరుధ్ స్వరపరచనున్న ఉత్సాహభరిత గీతం టోర్నీకి మరింత జోష్‌ను అందించనుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: