T20 World Cup 2026: ఇటలీపై వెస్టిండీస్ విజయం

Read Time:  1 min
T20 World Cup 2026: ఇటలీపై వెస్టిండీస్ విజయం
FONT SIZE
GET APP

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు తన దూకుడును కొనసాగిస్తోంది. గురువారం కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఇటలీని 42 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో గ్రూప్ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన విండీస్, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి అజేయంగా సూపర్-8 దశకు చేరుకుంది. కెప్టెన్ షాయ్ హోప్ (75) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు, బౌలింగ్‌లో షామార్ జోసెఫ్ (4/30), మాథ్యూ ఫోర్డ్ (3/25) చెలరేగడంతో విండీస్ విజయం సునాయాసమైంది.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్, హెట్‌మెయర్ త్వరగా ఔటయ్యారు.

Read Also: Supreme Court – Shami: క్రికెటర్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

18 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్

అయితే, కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. రోస్టన్ చేజ్ (24)తో కలిసి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (24), మాథ్యూ ఫోర్డ్ (16) వేగంగా ఆడటంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఇటలీ బౌలర్లలో క్రిషన్ కాలుగమగే, బెన్ మనేంటీ చెరో రెండు వికెట్లు తీశారు.166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీకి ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి.

T20 World Cup 2026: West Indies win over Italy
T20 World Cup 2026: West Indies win over Italy

పవర్‌ప్లే ముగిసేసరికి 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జేజే స్మట్స్ (24), బెన్ మనేంటీ (26) కాసేపు పోరాడినా, విండీస్ బౌలర్ల ధాటికి ఇటలీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముఖ్యంగా పేసర్ షామార్ జోసెఫ్ నాలుగు వికెట్లతో ఇటలీ పతనాన్ని శాసించాడు. అతనికి మాథ్యూ ఫోర్డ్ మూడు వికెట్లతో, గుడకేశ్ మోటీ రెండు వికెట్లతో చక్కటి సహకారం అందించారు. దీంతో ఇటలీ 18 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.