📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: T20 World Cup 2026: ఉప్పల్, చిన్నస్వామి స్టేడియాలకు దక్కని వేదిక

Author Icon By Anusha
Updated: November 26, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరగనున్నాయి. ఒకవేళ ఆ జట్టు నాకౌట్ చేరితే ఆ మ్యాచ్‌లు కూడా అక్కడే జరుగుతాయి.

Read Also: Virat Kohli: ద‌క్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన కోహ్లీ

అయితే, ఈ మెగా టోర్నీ (T20 World Cup 2026) కి ఎంపిక చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చోటు దక్కకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీకి ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

సాధారణంగా ఐసీసీ ఈవెంట్లకు వేదికలుగా నిలిచే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియాలను ఈసారి పక్కన పెట్టడం వెనుక బలమైన కారణాలున్నాయి.గత కొంతకాలంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అవినీతి ఆరోపణలు, అంతర్గత వివాదాలతో సతమతమవుతోంది.

ఎందుకు ఎంపిక చేయలేదు?

ముఖ్యంగా ఐపీఎల్ 18వ సీజన్‌లో టికెట్ల విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) యాజమాన్యంతో హెచ్‌సీఏ అప్పటి అధ్యక్షుడు గొడవపడటం, సీఈఓ కావ్య మారన్ బీసీసీఐకి ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలు హెచ్‌సీఏ ప్రతిష్ఠ‌ను దెబ్బతీశాయి. ఈ వివాదాల నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) కు అవకాశం ఇవ్వడానికి బీసీసీఐ (BCCI), ఐసీసీ (ICC) వెనుకాడినట్లు తెలుస్తోంది.మరోవైపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం భద్రతా కారణాల వల్ల అవకాశం కోల్పోయింది.

ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా ఆర్సీబీ నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెంద‌డం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై విచారణ జరిపిన కమిషన్, స్టేడియం నిర్మాణంలో లోపాలున్నాయని, ఇది సురక్షితం కాదని నివేదిక ఇచ్చింది. దీంతో పోలీసులు ఈ స్టేడియానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) జారీ చేయడం లేదు. ఈ కారణాలతోనే ఈ రెండు కీలక వేదికలను వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేయలేదని సమాచారం.

T20 వరల్డ్ కప్ మొదట ఎప్పుడు ప్రారంభమైంది?

మొదటి ఐసీసీ T20 వరల్డ్ కప్ 2007లో దక్షిణాఫ్రికాలో ప్రారంభమైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

ICC tournament venues India Sri Lanka host latest news T20 World Cup 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.