📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం

T20 World Cup 2026: ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే

Author Icon By Anusha
Updated: January 1, 2026 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ – శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup 2026) కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును అధికారికంగా ప్రకటించింది.ఉపఖండ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, స్పిన్ బౌలింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ సెలెక్టర్లు జట్టును రూపొందించారు. నెమ్మదైన పిచ్‌లు, టర్న్‌కు అనుకూలమైన పరిస్థితుల్లో రాణించేలా సమతూకంతో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Read Also: Vijay Hazare Trophy: విజయ్ హజారేలో సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం

మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న ఈ జట్టులో సెలెక్టర్లు స్పిన్నర్లకు పెద్దపీట వేశారు. భారత్, శ్రీలంక పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని నలుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేయడం విశేషం. ఈ జట్టు ఎంపికలో కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. గత 12 టీ20 మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా ఆడని యువ ప్లేయర్ కూపర్ కొన్నోలీకి సెలెక్టర్లు అవకాశం కల్పించారు.

మాథ్యూ కుహ్నెమాన్ తొలిసారిగా వరల్డ్ కప్

అలాగే జేవియర్ బార్ట్‌లెట్, మాథ్యూ షార్ట్, మాథ్యూ కుహ్నెమాన్ తొలిసారిగా వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధమయ్యారు. అయితే, మిచెల్ ఓవెన్‌కు జట్టులో చోటు దక్కలేదు. మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్, పేసర్ స్పెన్సర్ జాన్సన్ వెన్ను గాయం కారణంగా ఈసారి ఆసీస్ జట్టులో ఒక్క లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా లేకపోవడం గమనార్హం. జట్టులో ఏకైక వికెట్ కీపర్‌గా జోష్ ఇంగ్లిస్ ఎంపికయ్యాడు.

మరోవైపు సీనియర్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. వీరి ఫిట్‌నెస్ గురించి ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ‘క్రికెట్ డాట్ కామ్ డాట్ ఏయూ’ (cricket.com.au)తో మాట్లాడుతూ.. “కమిన్స్, హేజిల్‌వుడ్, డేవిడ్ కోలుకుంటున్నారు. వరల్డ్ కప్ సమయానికి వారు అందుబాటులో ఉంటారనే నమ్మకం ఉంది” అని తెలిపారు. ఐసీసీ నిబంధనల ప్రకారం జనవరి 31 వరకు జట్లలో మార్పులు చేసుకునే అవకాశం ఉంది.

T20 World Cup 2026: This is Australia’s World Cup squad

ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్

ఆస్ట్రేలియా ఫిబ్రవరి 11న కొలంబోలో ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఫిబ్రవరి 13న జింబాబ్వేతో, ఫిబ్రవరి 16న కాండీలో శ్రీలంకతో, ఫిబ్రవరి 20న ఒమన్‌తో తలపడనుంది. గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరుగుతాయి. సూపర్ ఎయిట్‌కు అర్హత సాధిస్తే భారత్‌కు ప్రయాణించాల్సి ఉంటుంది.

ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ జట్టు

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానొలీ, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అడమ్ జాంపా.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Australia Cricket Team Australia T20 World Cup squad India Sri Lanka T20 World Cup latest news T20 World Cup 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.