ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న T20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026), టోర్నీలో మంచు ప్రభావం కీలక పాత్ర పోషించనుందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పందించాడు..”ఫిబ్రవరి, మార్చి నెలల్లో సాయంత్రం పూట మ్యాచ్‌లు ఉంటాయి కాబట్టి మంచు ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఇది అంత సులభం కాదు.
Read Also: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన
అతడిపై మంచు ప్రభావం ఉండకపోవచ్చు
అయితే తడి బంతితో బౌలింగ్ చేయడం స్పిన్నర్లకు కొత్తేమీ కాదు” అని కుంబ్లే జియోహాట్‌స్టార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ శైలి వల్ల అతడిపై మంచు ప్రభావం అంతగా ఉండకపోవచ్చని విశ్లేషించాడు.”వరుణ్ బంతిని పట్టుకునే తీరు, అతను వేసే వేగం వల్ల తడి బంతితో అంతగా ఇబ్బంది పడడని నేను అనుకుంటున్నాను. అక్షర్ పటేల్ కూడా ఫర్వాలేదు. అయితే కుల్దీప్ యాదవ్‌కు కాస్త కష్టం కావచ్చు.
అయినప్పటికీ, ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం కుల్దీప్‌కు కూడా అలవాటే” అని వివరించాడు.అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగాలని కుంబ్లే స్పష్టం చేశాడు. “మంచు గురించి ఎక్కువగా ఆలోచించకుండా, అత్యుత్తమ జట్టునే ఆడించాలి. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతోనే వెళ్లాలనుకుంటే, బౌలింగ్ సమయంలో మంచు ఎక్కువగా ఉంటుందని తెలిస్తే కుల్దీప్ కంటే వరుణ్‌కే ప్రాధాన్యం దక్కవచ్చు” అని అభిప్రాయపడ్డాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: