బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026) లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసీసీ చేర్చినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. గ్రూప్-Cలోని ఇటలీ, నేపాల్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లతోపాటు స్కాట్లాండ్ కూడా ఉంటుందని పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య కొంత కాలంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత్‌లో ఆడేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
Read Also: Suryakumar Yadav: నా భార్య ఇచ్చిన సలహా వల్లే ఫామ్‌లోకి వచ్చా: సూర్య
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రతపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసింది. ఈ సమస్యలను ఐసీసీ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సరైన పరిష్కారం లభించలేదని ఆరోపిస్తూ, టోర్నమెంట్‌ను బహిష్కరిస్తున్నట్లు బీసీబీ గురువారం ప్రకటించింది.
స్కాట్లాండ్‌కు స్వర్ణావకాశం
ఈ వివాదాన్ని డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీకి అప్పగించాలని బీసీబీ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. కమిటీకి అప్పీళ్లపై విచారణ జరిపే అధికారం లేదని, ఐసీసీ తీసుకున్న నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది. టోర్నీలో పాల్గొనకపోతే స్కాట్లాండ్‌తో భర్తీ చేస్తామని ఇచ్చిన అల్టిమేటంపై బీసీబీ నుంచి స్పందన రాకపోవడంతో ఐసీసీ ఈ నిర్ణయాన్ని అమలు చేసింది.
స్కాట్లాండ్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో ఆడనుంది. ఆ తర్వాత ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్‌తో తలపడనుంది.స్కాట్లాండ్ ఇప్పటివరకు ఐదు టీ20 ప్రపంచకప్‌లలో పాల్గొంది. గత రెండు టోర్నీల్లో సూపర్ 8 దశకు చేరుకోలేకపోయినా, పెద్ద జట్లకు గట్టిపోటీనిచ్చింది. యూరోపియన్ క్వాలిఫైయర్స్‌లో మెరుగైన స్థానంలో నిలవకపోయినా, ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్‌కు ఈ అనూహ్య అవకాశం దక్కింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: