T20 World cup 2026: మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామన్న PCB.. స్పందించిన ఐసీసీ

Read Time:  1 min
T20 World cup 2026: మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామన్న PCB.. స్పందించిన ఐసీసీ
FONT SIZE
GET APP

భారత్‌తో జరిగే టీ20 ప్రపంచకప్ (T20 World cup 2026) మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చేసిన ప్రకటనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పందించింది. ఈ అంశం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే పీసీబీ నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ ప్రకటన అంతర్జాతీయ క్రీడా సమగ్రతను దెబ్బతీస్తుందని, పాకిస్థాన్‌లోనూ క్రికెట్‌పై దీర్ఘకాలిక పరిణామాలు ఉండవచ్చని పేర్కొంది.

Read Also: Sunil Gavaskar : పాక్‌పై వేటా? ఐసీసీకి గవాస్కర్ షాకింగ్ సూచనలు!

పాకిస్తాన్ అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి

దీనిపై పున:పరిశీలన చేయాలంది. జాతీయ విధానాలను తాము గౌరవిస్తామని, అయితే అందరికీ ఆమోదమైన నిర్ణయాన్ని PCB తీసుకోవాలని ఆకాంక్షించింది.ఒక దేశం కావాలనే మ్యాచ్‌ను వదిలేస్తే, టోర్నీ గౌరవం దెబ్బతింటుందని స్పష్టం చేసింది. అలాగే, ప్రభుత్వాల పాత్రను గౌరవిస్తున్నామని చెప్పినా ఈ నిర్ణయం క్రికెట్‌కు,

ముఖ్యంగా పాకిస్తాన్ అభిమానులకు కూడా మంచిది కాదని ఐసీసీ వ్యాఖ్యానించింది.ఈ టోర్నీలో పాకిస్తాన్ గ్రూప్-ఏలో ఉంది. భారత్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా జట్లతో కలిసి పోటీపడనుంది. పాకిస్తాన్ అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా, ఫిబ్రవరి 10న అమెరికాతో, ఫిబ్రవరి 18న నమీబియాతో తలపడనుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.