📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

T20 World Cup 2026: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌

Author Icon By Anusha
Updated: February 7, 2026 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మెగా టోర్నీకి ఇదే తొలి మ్యాచ్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానుల దృష్టి, ఈ మ్యాచ్‌ పై నిలిచింది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ జట్టు ముందుగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయించింది. సల్మాన్‌ అఘా పాకిస్థాన్‌ జట్టుకు, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ నెదర్లాండ్స్‌ జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి.

Read Also: T20 WC: నేటి నుంచి టీ20 ప్రపంచకప్

మా ప్రణాళికలను ఖచ్చితత్వంతో అమలు చేయడమే మా లక్ష్యం

టాస్ గెలిచిన అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ.. “మేము ముందుగా ఫీల్డింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్‌పై తేమ ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాం. ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగుతున్నాం. నెదర్లాండ్స్ మంచి జట్టు. మా ప్రణాళికలను ఖచ్చితత్వంతో అమలు చేయడమే మా లక్ష్యం” అని తెలిపాడు.

నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ.. “మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం. అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. గత నెలన్నరగా భారత్, శ్రీలంకల్లోనే ఆడుతూ పరిస్థితులకు అలవాటుపడ్డాం. మా జట్టులో చాలా మంది ఆల్‌రౌండర్లు ఉన్నారు” అని ధీమా వ్యక్తం చేశాడు.

T20 World Cup 2026: Pakistan wins the toss and elects to bowl

ఇరు జట్ల ప్లేయింగ్ XI వివరాలు
పాకిస్థాన్ జట్టు: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ అజామ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్.

నెదర్లాండ్స్ జట్టు: మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ’డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), జాక్ లయన్-కాచెట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, పాల్ వాన్ మీకెరెన్.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Colombo match latest news Pakistan vs Netherlands T20 World Cup 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.