T20 World Cup 2026: మొదటి మ్యాచ్‌కు జస్‌ప్రీత్‌ బుమ్రా దూరం

Read Time:  1 min
T20 World Cup 2026: మొదటి మ్యాచ్‌కు జస్‌ప్రీత్‌ బుమ్రా దూరం
FONT SIZE
GET APP

టీ20 ప్రపంచకప్‌ 2026 (T20 World Cup 2026) లో భాగంగా భారత్‌, యూఎస్‌ఏల మధ్య జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియాకుషాక్‌ తగిలేలా కనిపిస్తోంది. స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నాడనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు బుమ్రా హాజరుకాలేకపోయాడు. పూర్తిగా కోలుకోకపోతే యూఎస్‌ఏతో జరిగే మ్యాచ్‌కు బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి..

Read Also: Siraj Joins T20 Squad: హర్షిత్ స్థానంలో సిరాజ్.. బీసీసీఐ ప్రకటన

రాణా స్థానంలో మహ్మద్ సిరాజ్‌

ఇదిలా ఉంటే.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఇంకా జట్టుతో కలవలేదు. ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఉన్నాడు. ఈ పరిణామాలతో తొలి మ్యాచ్ నాటికి భారత్ వద్ద కేవలం 13 మంది పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. ఈ నెల 4న దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా గాయపడ్డాడు.

T20 World Cup 2026: Jasprit Bumrah ruled out of first match
T20 World Cup 2026: Jasprit Bumrah ruled out of first match

కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన అతడు మోకాలి నొప్పితో మైదానాన్ని వీడాడు. రాణా గాయంపై స్కాన్‌లు, నిపుణుల సంప్రదింపుల అనంతరం టోర్నీలో పాల్గొనడం సాధ్యం కాదని బీసీసీఐ వైద్య బృందం నిర్ధారించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నిన్న‌ రాత్రి అధికారికంగా ప్రకటించారు. రాణా స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.