T20 World Cup 2026: భారత్ సెమీ ఫైనల్ చేరదు: పాక్ మాజీ బౌలర్

Read Time:  1 min
T20 World Cup 2026: భారత్ సెమీ ఫైనల్ చేరదు: పాక్ మాజీ బౌలర్
FONT SIZE
GET APP

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశను విజయవంతంగా ముగించిన భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ విమర్శనాస్త్రాలు సంధించాడు. గ్రూప్ దశలో భారత్ అద్భుతంగా రాణించినట్లు కనిపిస్తున్నా, అసలైన సవాల్ ఎదురయ్యే సూపర్‌-8లో భారత్ తేలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డాడు.. టీమిండియా సెమీ ఫైనల్ వరకు రావడం అసాధ్యమని ఆమిర్ అభిప్రాయపడ్డాడు.

Read Also: Siraj injured in nets: మహ్మద్‌ సిరాజ్‌కు గాయం

నేటి నుంచి సూపర్ 8 మ్యాచ్‌లు

గ్రూప్ దశలో పాకిస్థాన్‌పై మాత్రమే భారత బ్యాటర్లు బాగా ఆడారని చెప్పాడు. యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ లాంటి చిన్ని జట్లపై ఒకరిద్దరు మాత్రమే రాణించారని అన్నాడు. పసికూన జట్లపై గెలవడాన్ని గొప్పగా భావించకూడదని చెప్పాడు.సూపర్ 8లో జింబాబ్వే లాంటి డేంజర్ జట్లు ఉన్నాయని… భారత్ ఇక్కడే ఓడిపోతుందని ఆమిర్ అన్నాడు.

T20 World Cup 2026: India will not reach the semi-finals: Former Pakistan bowler
T20 World Cup 2026: India will not reach the semi-finals: Former Pakistan bowler

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ సెమీ ఫైనల్ దాకా వస్తాయని, భారత్ మాత్రం సెమీ ఫైనల్ చేరదని చెప్పాడు.నేటి నుంచి సూపర్ 8 మ్యాచ్‌లు మొదలవుతున్నాయి. ఈరోజు మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ పాకిస్థాన్ మధ్య జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్ రేపు దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌తో కూడా మ్యాచ్‌లు ఉన్నాయి.  

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.