📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 WC 2026 : సూర్య మెరుపులు, భారత్‌కు ఘన ఆరంభం!

Author Icon By Sai Kiran
Updated: February 8, 2026 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

T20 WC 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజయంతో బోణీ కొట్టింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో అమెరికాపై భారత్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ధశతకంతో జట్టును ఆదుకోగా, భారత బౌలర్లు సమష్టిగా రాణించి అమెరికాను కట్టడి చేశారు.

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టుకు శుభారంభం దక్కలేదు. మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌ల ధాటికి తొలి దశలోనే మూడు వికెట్లు కోల్పోయింది. మిలింద్ కుమార్ (34), సూరజ్ కృష్ణమూర్తి (37), శుభమ్ రంజనే (37) పోరాడినప్పటికీ భారత బౌలర్ల పట్టు ముందు నిలవలేకపోయారు. సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. ఫలితంగా అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది.

Read Also: Soil testing : భూసార పరిరక్షణతోనే సాగు ముందడుగు

T20 WC 2026

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్‌లో తొలుత తడబడింది. అభిషేక్ శర్మ (0), ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25), శివమ్ దూబే (0) త్వరగా వెనుదిరిగారు. ఒకే ఓవర్లో కీలక వికెట్లు కోల్పోయిన భారత్ 46 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

ఈ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాధ్యత తీసుకుని ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో అక్షర్ పటేల్ (14) సహకారంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈ గెలుపుతో టీమిండియా టోర్నీని విజయవంతంగా ప్రారంభించింది. భారత్ తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 12న నమీబియాతో ఆడనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

arshdeep singh bowling Axar Patel performance Breaking News in Telugu Google News in Telugu IND vs USA result India beat USA by 29 runs India vs USA match highlights Latest News in Telugu Mohammed Siraj wickets Suryakumar Yadav 84 T20 World Cup 2026 Team India T20 World Cup news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.