భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌పై వివాదం మరింత ముదిరింది. భారత్‌లో T20 వరల్డ్ కప్ (T20 World Cup 2026) ఆడేది లేదని ఇప్పటికే స్పష్టంగా చెప్పిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB). నిన్న ICC వివాద పరిష్కార కమిటీ (Dispute Resolution Committee – DRC)ని ఆశ్రయించిన BCB, భారత్‌లోనే మ్యాచ్‌లు ఆడాల్సిందే అన్న ICC నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అయితే ఈ విషయంలో DRC తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. అయితే నిబంధనల ప్రకారం ICC నిర్ణయంలో జోక్యం చేసుకొనే అధికారం తమకు లేదని DRC చెప్పింది.
Read Also: Team India: పాక్ రికార్డును బద్దలుకొట్టిన భారత్
స్కాట్లాండ్‌ను ఎంపిక చేయడంపై ఇవాళ నిర్ణయం తీసుకోనుంది
ఐసీసీ రాజ్యాంగం ప్రకారం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఈ కమిటీకి లేదు. అంటే బంగ్లాదేశ్ చేసిన అప్పీల్‌ను ఈ కమిటీ విచారణకు కూడా స్వీకరించదు. ఒకవేళ ఇక్కడ చుక్కెదురైతే స్విట్జర్లాండ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌కు వెళ్లాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.
కానీ అప్పటికే సమయం మించిపోతుండటంతో ఐసీసీ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది.అటు BCB మంకు పట్టు వీడని నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేయడంపై ఇవాళ ICC తన నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్సుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: