T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ జట్టు పరిస్థితి కష్టతరంగా మారింది. భారత్ చేతిలో పరాజయం తర్వాత కుదురుకుని సూపర్-8కి చేరినప్పటికీ, ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓడిపోవడం ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. సెమీఫైనల్ చేరాలంటే శ్రీలంకపై భారీ విజయం సాధించడంతో పాటు, న్యూజిలాండ్ మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని ఆశించాలి. ఇంగ్లాండ్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుండగా గ్యాలరీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల అభిమానుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Read Also: T20 WC 2026: భారత్ ఓటమి ఒక రకంగా మేలు చేసేదే: రవిశాస్త్రి
స్టాండ్స్‌లో ఇంగ్లాండ్ అభిమాని, పాకిస్థాన్ మద్దతుదారుడి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వావాదం కాస్తా ముదిరి ఒకరినొకరు నెట్టుకోవడం కొట్టుకునే స్థాయికి చేరింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పక్కనే ఉన్న శ్రీలంక అభిమానులు వెంటనే స్పందించి వారిద్దరినీ విడదీయాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను, ఇన్‌ఫ్లుయెన్సర్ జేక్ జెన్నింగ్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.
అసలు కారణం ఏంటి?
ఈ గొడవపై సదరు పాకిస్థాన్ అభిమాని సౌద్ తన వివరణ ఇచ్చాడు. ఇంగ్లాండ్ అభిమాని తనను కావాలనే రెచ్చగొట్టాడని.. తన వైపు బీర్ బాటిళ్లను విసిరి అసభ్యంగా ప్రవర్తించాడని అతను ఆరోపించాడు. తన ఆత్మరక్షణ కోసమే తాను ప్రతిఘటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: