📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

T20 World Cup 2026: విజేతలకు కాసుల వర్షం.. ప్రైజ్ మనీ  ఎంతో తెలుసా?

Author Icon By Anusha
Updated: March 4, 2026 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకోవడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి టోర్నీలో విజేతగా నిలిచే జట్టుతో పాటు, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఇతర జట్లకు కూడా ఐసీసీ భారీ నగదు బహుమతులను ప్రకటించింది. ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ కేటాయించిన మొత్తం ప్రైజ్ ఫండ్ సుమారు రూ. 120.37 కోట్లు. గత ఎడిషన్లతో పోలిస్తే ఈసారి బహుమతి మొత్తాన్ని గణనీయంగా పెంచడం విశేషం.

Read Also: T20 World Cup 2026: చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్

ఛాంపియన్, రన్నరప్‌లకు దక్కే వాటా ఇదే!

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచే జట్టుకు రూ. 27 కోట్లకు పైగా ప్రైజ్ మనీ లభించే అవకాశం ఉంది.ఐసీసీ సాధారణంగా బహుమతులను అమెరికన్ డాలర్లలో ప్రకటించినప్పటికీ, భారత రూపాయల్లో లెక్కిస్తే ఈ మొత్తం గత టోర్నమెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది.రన్నరప్, సెమీఫైనలిస్టులకు కూడా రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ..

T20 World Cup 2026: Cash shower for the winners.. Do you know how much the total prize fund is?

రన్నరప్ జట్టుకు సుమారు రూ. 14.65 కోట్లు.సెమీఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు ఒక్కో జట్టుకు రూ. 7.24 కోట్లు.అదే విధంగా 5వ స్థానం నుంచి 12వ స్థానం మధ్య నిలిచిన జట్లకు కూడా ఒక్కో జట్టుకు సుమారు రూ. 3.48 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.అయితే, ఈ మొత్తాలు రూపాయి మారకం విలువపై ఆధారపడి కొంత మారవచ్చు.ఈ భారీ ప్రైజ్ మనీ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2026 పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. టైటిల్ కోసం జట్లు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

టోర్నమెంట్ కీలక దశలో..

టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభంలో మొత్తం 20 జట్లు పోటీలో పాల్గొన్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్-8 దశలు ముగిసిన తర్వాత ఇప్పుడు కేవలం నాలుగు జట్లు మాత్రమే మిగిలాయి.

మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్‌తో తలపడుతుంది. రెండో సెమీఫైనల్‌లో భారత్ ఇంగ్లాండ్‌తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లలో గెలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cricket News ICC Prize Money Details prize money T20 WC Champion Reward

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.