T20 World Cup 2026: వరుస డకౌట్లపై అభిషేక్ శర్మ ఎమోషనల్

Read Time:  1 min
T20 World Cup 2026: వరుస డకౌట్లపై అభిషేక్ శర్మ ఎమోషనల్
FONT SIZE
GET APP

T20 World Cup 2026: ICC టీ20 వరల్డ్ కప్‎లో వరుస వైఫల్యాలపై టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఎమోషనల్ అయ్యాడు.భారీ అంచనాలతో బరిలోకి దిగిన అభిషేక్ వరల్డ్ కప్ గ్రూప్ దశలో మూడు మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు. అమెరికా, ఒమన్ వంటి జట్లపైన పరుగులు చేయడానికి తంటాలు పడ్డాడు. అతని వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, సూపర్ 8లో జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచులో హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read Also: NZ vs ENG: కివీస్‌పై ఇంగ్లండ్ విజయం.. పాక్‌కు లైన్ క్లియర్!

T20 World Cup 2026: Abhishek Sharma emotional over consecutive ducks
T20 World Cup 2026: Abhishek Sharma emotional over consecutive ducks

‘నా కంటే సహచర క్రికెటర్లకే నాపై నమ్మకం ఎక్కువగా ఉంది. హాఫ్ సెంచరీ చేశాక భావోద్వేగానికి గురయ్యా. అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు ప్రయత్నించా. అయినా నా బెస్ట్ ఇంకా రాలేదు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ చాలా అద్భుతంగా ఉంది. మేం ఒక జట్టులా కాకుండా కుటుంబంలా ఉంటాం. అందుకే నా నుంచి బెస్ట్ గేమ్ రావాలని జట్టు అంతా కోరుకుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నా. నేను కూడా ఎదురు చూస్తున్నా.టీ20 ప్రపంచకప్ ప్రారంభమయ్యే సమయానికి నా ఆరోగ్యం కూడా అంత బాలేదు.

నాపై చాలా నమ్మకం ఉంచారు

అంతకుముందు ఆసుపత్రిపాలయ్యా. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో దేశం కోసం తొలి మ్యాచ్ ఆడేటప్పుడు మంచి ఆరంభం దక్కాలని కోరుకున్నా. కానీ అలా జరగలేదు. అయినా సరే, జట్టు సభ్యుల నుంచి ఇప్పటికీ అదే మద్దతు లభిస్తోంది. మరీ ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యభాయ్ నాపై చాలా నమ్మకం ఉంచారు. ఇంకో మ్యాచ్ డకౌట్ అయినా సరే పక్కన పెట్టేది లేదని.. జట్టు కోసం విజయాలు అందించాలని చెప్పారు. జట్టుకు కీలకమైన ప్లేయర్‌గా నన్ను భావించారు. అందుకే, జింబాబ్వేపై హాఫ్ సెంచరీని నేను నా జట్టు సహచరులు, కోచ్, కెప్టెన్‌కు అంకితం చేశాం.’అని అభిషేక్ వెల్లడించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.