T20 WC: ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్‌కు మాజీల ప్రశ్న!

Read Time:  1 min
T20 WC: ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్‌కు మాజీల ప్రశ్న!
FONT SIZE
GET APP

T20 వరల్డ్ కప్‌లో (T20 WC) భారత్‌తో మ్యాచ్ ఆడకూడదన్న పాక్ నిర్ణయాన్ని ఆ దేశ మాజీ ప్లేయర్లే విమర్శిస్తున్నారు.ఈ నెల‌ 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థతో మాట్లాడిన కనేరియా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై విరుచుకుపడ్డాడు. ఈ నిర్ణయంలో ఎలాంటి హేతుబద్ధత లేదన్నాడు.’భారత్‌లో పర్యటించబోమని గతంలోనే పాకిస్థాన్ చెప్పింది.

Read Also: Michelle Marsh: భారత్, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

భారత్ ఆడుతున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను చూసి పాకిస్థాన్ భయపడుతోంది

వచ్చే మూడేళ్ల పాటు తటస్థ వేదికగా ఆడేలా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దాంతోనే పాకిస్థాన్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ మ్యాచ్‌ను బహిష్కరించడంలో అర్థం లేదు. ఈ అనాలోచిత నిర్ణయంతో పాకిస్థాన్ తమ సెమీఫైనల్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది. ప్రస్తుతం భారత్ ఆడుతున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను చూసి పాకిస్థాన్ భయపడుతోంది.

T20 WC: What would you do if you had to face India in the final? Former players' question to Pakistan!
T20 WC: What would you do if you had to face India in the final? Former players’ question to Pakistan!

ప్రపంచకప్‌ (T20 WC) లో ప్రతీసారి భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోతూనే ఉంది. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచకప్ టోర్నీ సెమీస్, ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? అప్పుడు కూడా ఆడకుండా ట్రోఫీని అప్పగిస్తారా? మైదానంలో పోరాడి గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలి కానీ, ఇలా బహిష్కరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అని కనేరియా పీసీబీకి చురకలు అంటించాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.