📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 WC: పాక్ యూటర్న్‌ పై డానిష్ కనేరియా ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: February 12, 2026 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వ్యవహార శైలిపై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తరచూ యూటర్న్ తీసుకునే పీసీబీ వైఖరి వల్ల అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ పరువు పోతుందని ఆయన మండిపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 (T20 WC) లో భాగంగా భారత్–పాకిస్థాన్ మధ్య జరగనున్న హైఓల్టేజ్ మ్యాచ్ విషయంలో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని కనేరియా వ్యాఖ్యానించాడు.

Read Also: T20 England vs West Indies : ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం

పీసీబీ వైఖరిని నిలదీశారు

బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన పాకిస్థాన్.. చివరకు ఐసీసీ చర్చలతో తలొగ్గింది. ఇతర దేశాల సూచనలతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరు ఇలానే ఉంటుందని, తాను ముందే చెప్పానని గుర్తు చేశాడు. పీసీబీ నిలకడలేని స్వభావాన్ని ఎండగట్టాడు.‘ప్రతిదానికి ఒక హద్దుంటుంది. ఈ డ్రామా ఇక్కడితో ఆగదని, వారు ఖచ్చితంగా తమ నిర్ణయాన్ని మార్చుకుంటారని నేను ముందే చెప్పాను. ఎందుకంటే వారు మాట మార్చడంలో నిపుణులు. యూటర్న్ స్పెషలిస్ట్‌లు.

T20 WC: What did Danish Kaneria say about Pakistan’s U-turn?

నిర్ణయాలు మార్చుకునేవారిలో వీళ్లను మించి మరెవ్వరినీ చూడలేదు. ఒక సమయంలో ఒకటి చెబుతారు, మరుక్షణమే పూర్తిగా భిన్నమైనది చెబుతారు. పాకిస్థాన్ ఈ చర్యలను చూసి ప్రపంచమంతా నవ్వుతోంది.’ అని కనేరియా విమర్శలు గుప్పించాడు.పీసీబీ డ్రామాతో బంగ్లాదేశ్ సమస్యను ఐసీసీ పరిష్కరించింది. కానీ పాకిస్థాన్ బోర్డుకు బంగ్లాదేశ్ ఎప్పుడు సాయం చేసిందని కనేరియా నిలదీసాడు. ‘మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పెద్ద ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడేమైంది? అకస్మాత్తుగా మిమ్మల్ని ఆడేలా మార్చిందేమిటి?” అంటూ పీసీబీ వైఖరిని నిలదీశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Danish Kaneria ICC T20 World Cup 2026 India vs Pakistan Match latest news Pakistan Cricket Board Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.