📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 WC: అభిషేక్ హెల్త్ గురించి అప్‌డేట్ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి

Author Icon By Anusha
Updated: February 13, 2026 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 ప్రపంచకప్ 2026 (T20 WC) లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతూ అభిమానుల్లో భారీ ఆశలు రేకెత్తిస్తోంది. గ్రూప్ దశలో ఇప్పటికే కీలక మ్యాచ్‌ల్లో గెలుపొందిన టీమిండియా, సెమీఫైనల్ దిశగా ధీమాగా అడుగులు వేస్తోంది. అయినప్పటికీ, ఈ టోర్నీలో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అసలైన పోరు మాత్రం ఫిబ్రవరి 15న జరగనుంది. శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో భారత జట్టు తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇండియా–పాక్ మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ, ఉత్సాహం వేరే స్థాయిలో ఉంటుంది.

Read Also: India vs Namibia T20 World : నమీబియాపై భారత్ భారీ స్కోరు

అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిట్‌నెస్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. పొట్ట సంబంధిత అనారోగ్యం కారణంగా నమీబియా మ్యాచ్‌కు దూరమైన ఈ యువ హిట్టర్, పాక్ మ్యాచ్‌లో కనిపిస్తాడా లేదా అన్నదానిపై తాజాగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నమీబియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత వరుణ్ చక్రవర్తి విలేకరులతో మాట్లాడుతూ అభిషేక్ శర్మ ఆరోగ్యంపై సానుకూల సంకేతాలు ఇచ్చాడు. అమెరికాతో మ్యాచ్ తర్వాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అభిషేక్, ఇప్పుడు డిశ్చార్జ్ అయి జట్టుతోనే ఉన్నాడు.

అభిషేక్ స్థానంలో ఇషాన్ కిషన్

“అభిషేక్ మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నేను అతనితో మాట్లాడాను, అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను” అని వరుణ్ వెల్లడించాడు. నమీబియాతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అభిషేక్ డగౌట్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరచడం కూడా అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

T20 WC: Varun Chakravarthy gives update on Abhishek’s health

ఒకవైపు వరుణ్ చక్రవర్తి ఆశాభావం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కాస్త భిన్నంగా ఉన్నాయి. నమీబియా మ్యాచ్ టాస్ సమయంలో సూర్య మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ కోలుకోవడానికి మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు పట్టవచ్చని హింట్ ఇచ్చాడు. ఒకవేళ పాక్ మ్యాచ్ సమయానికి అభిషేక్ వంద శాతం ఫిట్‌నెస్‌ సాధించకపోతే, అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా కొనసాగే అవకాశం ఉంది. కొలంబో చేరుకున్న తర్వాత ఫిబ్రవరి 14న జరిగే తుది ప్రాక్టీస్ సెషన్‌ను బట్టి అభిషేక్ భవితవ్యం తేలనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Abhishek Sharma fitness update India vs Pakistan Match latest news T20 World Cup 2026 Telugu News Varun Chakravarthy comments

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.