📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 WC: ఇటలీపై స్కాట్లాండ్ ఘన విజయం!

Author Icon By Anusha
Updated: February 9, 2026 • 4:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 (T20 WC) లో స్కాట్లాండ్ జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-సీలో భాగంగా పసికూన ఇటలీతో సోమవారం కోల్‌కతా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. 208 పరుగుల లక్ష్యఛేదనలో ఇటలీ.. 16.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. బెన్ మానెంటి (52), హెన్రీ మానెంటి (37), స్మట్స్ (22) మాత్రమే రాణించారు.

Read Also: T20WorldCup: టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్

T20 WC: Scotland’s emphatic win over Italy!

4 వికెట్ల నష్టానికి 207 పరుగులు

స్కాట్లాండ్ బౌలర్లలో మైకేల్ లీస్క్ 4, మార్క్ వాట్ 2, బ్రాడ్ క్యూరీ, బ్రాడ్ వీల్, డేవిడ్సన్ ఒక్కో వికెట్ తీశారు.అంతకుముందు స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ మున్సే (84) అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ మైకేల్ జోన్స్ (37) పరుగులు రాబట్టాడు.

ఈ జోడీ తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తర్వాత వచ్చిన బ్రాండన్ మెక్‌మిలన్ (41 నాటౌట్‌) మెరుపులు మెరిపించాడు. రిచీ బెరింగ్టన్ (15) పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మైకేల్ లీస్క్ (22) వరుసగా 4, 2, 4, 6, 6 బాదడంతో స్కోరు 200 దాటింది. ఇటలీ బౌలర్లలో అలీ హసన్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా, స్మట్స్ తలో వికెట్ తీశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ICC T20 World Cup 2026 latest news Scotland vs Italy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.