T20 WC: ఆ విషయంలో పాక్ ఎప్పుడైనా యూటర్న్ తీసుకోవచ్చు: ఇర్ఫాన్ పఠాన్

Read Time:  1 min
T20 WC: ఆ విషయంలో పాక్ ఎప్పుడైనా యూటర్న్ తీసుకోవచ్చు: ఇర్ఫాన్ పఠాన్
FONT SIZE
GET APP

టీ20 ప్రపంచ కప్ 2026 సమరం నేడు(ఫిబ్రవరి 7) ఘనంగా ప్రారంభం కాబోతోంది. మరోవైపు, ఈ నెల 15న ఇండియా – పాకిస్థాన్ మధ్య కొలంబోలో హైవోల్టేజ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ ను తాము ఆడబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది.పాకిస్థాన్ ప్రభుత్వం ప్రస్తుతం భారత్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడబోమని చెబుతున్నప్పటికీ, అది కేవలం తాత్కాలిక నిర్ణయమేనని మాజీ భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు.

Read Also: T20 World Cup 2026: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌

మనల్ని పాకిస్థాన్ ఛాలెంజ్ చేసే పరిస్థితి కనిపించట్లేదు

ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మ్యాచ్ పై అభిమానుల దృష్టి పడుతుంది.

గ్రూప్ స్టేజ్ లో మనకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఇర్ఫాన్ అన్నాడు.ఒకవేళ వాళ్లు యూటర్న్ తీసుకుని మనతో ఆడాలనుకున్నా..మనకు ఛాలెంజ్ విసిరేంత సామర్థ్యం వాళ్లకు ఉందా? అని ఎద్దేవా చేశాడు. మనల్ని పాకిస్థాన్ ఛాలెంజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదని అన్నాడు. ఇక టీ20 వరల్డ్ కప్ లో ఈనాటి మ్యాచ్ ల విషయానికి వస్తే..

T20 WC: Pakistan can take a U-turn on that issue anytime: Irfan Pathan
T20 WC: Pakistan can take a U-turn on that issue anytime: Irfan Pathan

ప్రస్తుతం పాక్ – నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. రెండో మ్యాచ్ కోల్ కతాలో మధ్యాహ్నం 3 గంటలకు వెస్టిండీస్ – స్కాట్లాండ్ మధ్య జరగనుంది. మూడో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు భారత్ – యూఎస్ఏ మధ్య జరగబోతోంది.

షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ జరగాలి. ఒకవేళ పాక్ రాకపోతే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్‌కు ‘వాక్ ఓవర్’ ద్వారా 2 పాయింట్లు లభిస్తాయి. కానీ క్రికెట్ అభిమానులు మాత్రం దాయాదుల మధ్య హోరాహోరీ పోరు కోసమే ఎదురుచూస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.