📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 WC: జింబాబ్వే తో మ్యాచ్.. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా

Author Icon By Anusha
Updated: February 13, 2026 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
T20 WC: Match against Zimbabwe.. Australia wins the toss

టీ20 వరల్డ్ కప్ 2026 (T20 WC) లో భాగంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న మరో ఆసక్తికర మ్యాచ్ కొలంబోలో జరగనుంది. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రసిద్ధ ప్రేమదాస స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. గ్రూప్ దశలో కీలకంగా మారే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది..ఈ నిర్ణయం ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Read Also: Ishan Kishan half century: ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్ విధ్వంసం

‘మేము ముందు బౌలింగ్ చేస్తాం. మాకు కొన్ని ఫిట్‌నెస్ స‌మస్య‌లు ఉన్నాయి. గ‌తంలో కూడా ఇలాగే జ‌రిగింది. ఇది మంచి జ‌ట్టు. నిన్న రాత్రి బాగా ఆడాము. ఈరోజు బ‌లమైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు కృషి చేస్తాం. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా ఆడాలి. మా ర‌న్‌రేటును మెరుగు ప‌ర‌చుకోవాల‌ని ఆశిస్తున్నాను. స్మిత్ ఇక్కడ లేడు. అతను రెండు రోజుల క్రితం గోల్ఫ్ ఆడాడు. అతను చెన్నైలో ఉన్నాడని అనుకుంటున్నాను. అతను ఉంటే ప‌రిస్థితులు ఇంకాస్త మెరుగ్గా ఉంటాయి. ఇక మా కెప్టెన్ త్వ‌ర‌లోనే ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని ఆశిస్తున్నాను. తుది జ‌ట్టులో రెండు మార్పులు ఉన్నాయి. కొన్నోలీ, బారెట్ స్థానాల్లో బెన్ డ్వార్షియస్, టిమ్ డేవిడ్ జ‌ట్టులోకి వ‌చ్చారు. ‘అని ఆసీస్ తాత్కాలిక కెప్టెన్ ట్రావిస్ హెడ్ అన్నాడు.

‘మేం టాస్ గెలిస్తే బౌలింగ్ చేసేవాళ్లం. అయిన‌ప్ప‌టికి తొలుత బ్యాటింగ్ చేయ‌డం ఏమంత చెడ్డ విష‌యం కాదు. పిచ్ నెమ్మ‌దిగా ఉండొచ్చు. సూర్యుడు వ‌స్తే బ్యాటింగ్‌కు అనుకూలించ‌వ‌చ్చు. పిచ్ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి మేము ఓ అద‌న‌పు స్పిన్న‌ర్‌ను తీసుకున్నాము. మేము పెద్ద‌గా ద్వైపాక్షిక సిరీసులు ఆడ‌డం లేదు. కాబ‌ట్టి ఐసీసీ టోర్న‌మెంట్ మాకు మంచి అవ‌కాశం. మేం ఉత్త‌మ‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శిస్తాము. త‌రువాత ఏం జ‌రుగుతుందో చూడాలి. తుది జ‌ట్టులో రెండు మార్పులు ఉన్నాయి. దుర‌దృష్ట‌వ‌శాత్తు బ్రెండ‌న్ టేల‌ర్ గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూరం అయ్యాడు. ముందు జాగ్ర‌త్త‌గా రిచర్డ్ న్గారవాకు విశ్రాంతి ఇస్తున్నాము. టోనీ మున్యోంగా, గ్రీమ్ క్రీమర్ లు తుది జ‌ట్టులోకి వ‌చ్చారు.’ అని సికింద‌ర్ ర‌జా అన్నాడు.

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు..
ట్రావిస్ హెడ్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీప‌ర్‌), కామెరూన్ గ్రీన్, మాట్ రెన్షా, గ్లెన్ మాక్స్‌వెల్‌, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, మాథ్యూ కుహ్నెమాన్.

జింబాబ్వే తుది జ‌ట్టు..
బ్రియాన్ బెన్నెట్, తాడివానాషే మారుమణి(వికెట్ కీప‌ర్‌), డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్‌), ర్యాన్ బర్ల్, టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, గ్రేమ్ క్రీమర్, బ్లెస్సింగ్ ముజరబానీ.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Australia vs Zimbabwe match latest news T20 World Cup 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.