టీ20 ప్రపంచ కప్ (T20 WC) లో భాగంగా ఈ నెల ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌ను పాకిస్తాన్ తొలుత బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల కారణంగా మ్యాచ్‌కు దూరంగా ఉంటామని చెప్పిన పాకిస్తాన్, టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని రెండు రోజుల క్రితం పాకిస్థాన్ ప్రకటించింది. దీంతో కొలంబోకు విమాన టిక్కెట్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి.
Read Also: Abhishek Sharma: ఆసుపత్రిలో చేరిన అభిషేక్.. మ్యాచ్ డౌట్ యే
ముంబై-కొలంబో-ముంబై విమాన టిక్కెట్ ధర నిన్న ఉదయం రూ.60,000గా ఉండగా, ఈరోజు మరింత పెరిగింది.ముంబై నుంచి కొలంబోకు ఎకానమీ టిక్కెట్ ధర రూ.60,000 ఉండగా, ప్రీమియం ఎకానమీ ధర రూ.84,000గా ఉంది. శ్రీలంక ఎయిర్ లైన్స్‌లో ముంబై-కొలంబో విమానం టిక్కెట్ ధర రూ.63,340, బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధర రూ.1,34,157గా ఉంది.సాధారణంగా ఢిల్లీ-కొలంబో టిక్కెట్ ధర రూ.30,000 ఉండగా, ఇప్పుడు రూ.90,000కు చేరుకుంది. బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరలు రూ.1,92,000 నుంచి రూ.2,25,000 వరకు పలుకుతున్నాయి.
ఓల్టేజ్ పోరుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ప్రీమియం త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఒకరోజుకు డబుల్ బెడ్ రూమ్‌ల ధరలు రూ.1.05 లక్షల నుంచి రూ.1.06 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. డిమాండ్ లేని సమయాల్లో ఈ ధర రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 12న నమీబియాతో మ్యాచ్ ఆడిన తర్వాత భారత్ కొలంబోకు ప్రయాణం చేయనుంది.
పాక్ మ్యాచ్ ఖరారైన నేపథ్యంలో ఇరు జట్లు పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టే అవకాశం ఏర్పడింది. ఐసీసీ మధ్యవర్తిత్వంతో వివాదం ముగియడంతో ఇప్పుడు టోర్నమెంట్ మొత్తం ఆటపైనే కేంద్రీకృతమైంది. మరోసారి భారత్ – పాకిస్తాన్ మధ్య జరగబోయే హై ఓల్టేజ్ పోరుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: