📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

T20 WC: టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

Author Icon By Aanusha
Updated: March 7, 2026 • 12:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

T20 WC: క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు కొన్ని మధురమైన దృశ్యాలు అభిమానుల మనసు గెలుచుకుంటాయి. తాజాగా టీమిండియా మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన జాతీయ గీతాలాపనలో ఒక చిన్నారి ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ చిన్నారి అమాయకత్వం, దేశం పట్ల చూపిన భక్తి నెటిజన్లను కట్టిపడేసింది.

Read Also: Varun Chakravarthy: మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

సంజూ శాంసన్ ముందు దండం పెట్టి ప్రార్థన

జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ముందు నిల్చున్న ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. రెండు చేతులు జోడించి, కళ్లు మూసుకుని ఎంతో భక్తితో జాతీయ గీతాన్ని పాడిన ఆ చిన్నారి వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆ పాప చూపిన భక్తి వల్లే సంజూ శాంసన్ ఆ మ్యాచ్‌లో గండం నుంచి గట్టెక్కాడని, ఆ చిన్నారి టీమిండియాకు లక్కీ చార్మ్ అని అభిమానులు అభివర్ణిస్తున్నారు.

T20 WC: Fans request to bring Team India’s ‘Lucky Girl’ to the final!

అహ్మదాబాద్ గండం గట్టెక్కాలంటే ‘లక్కీ గర్ల్’ రావాల్సిందే!

త్వరలో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ఈ చిన్నారిని తీసుకురావాలని బీసీసీఐ (BCCI) కి నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. “ఈ లక్కీ గర్ల్ స్టేడియంలో ఉంటే విజయం మనదే” అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అహ్మదాబాద్ మైదానం గతంలో భారత్‌కు కలిసి రాలేదని, వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఇక్కడే ఓటమి ఎదురైందని గుర్తు చేస్తూ.. ఈసారి సెంటిమెంట్ మార్చడానికి ఆ చిన్నారిని ఆహ్వానించాలని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ahmedabad Narendra Modi Stadium India vs New Zealand Final Lucky Girl Viral Video Sanju Samson T20 WC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.