📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

T20 WC: టీమ్ యూఎస్‌కు ఆల్ ది బెస్ట్: ట్రంప్

Author Icon By Anusha
Updated: February 9, 2026 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 (T20 WC) లో బరిలోకి దిగిన అమెరికా జట్టుకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ చేశారు. “భారత్‌లో క్రికెట్ ప్రపంచకప్ జరుగుతోందని ఇప్పుడే విన్నాను. టీమ్ యూఎస్‌ఏకు నా శుభాకాంక్షలు. మనది చాలా బలమైన జట్టు. అమెరికా మొత్తం మీకు మద్దతుగా నిలుస్తుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అమెరికా జట్టు క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

Read Also: T20 World Cup: అఫ్గాన్‌పై న్యూజిలాండ్‌ విజయం

T20 WC: All the best to Team USA: Trump

భారత్‌కు గట్టి పోటీ

గత ప్రపంచకప్‌లో 2009 ఛాంపియన్ అయిన పాకిస్థాన్‌కు షాకిచ్చి ‘జెయింట్ కిల్లర్’ అనే పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది టోర్నీలోనూ బలమైన ఆరంభాన్ని అందుకుంది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన భారత్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయినప్పటికీ, తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ టోర్నీలో అమెరికా జట్టు గ్రూప్ ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. సూపర్ 8 దశకు చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే, అమెరికా తన తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై తప్పక గెలవాల్సి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Donald Trump ICC T20 World Cup 2026 latest news Telugu News USA cricket team

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.