📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్

T20 WC: టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ

Author Icon By Anusha
Updated: February 4, 2026 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 ప్రపంచకప్ (T20 WC) ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. భారత్, శ్రీలంక సంయుక్త వేదికలుగా జరగనున్న ఈ పొట్టి ప్రపంచకప్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని టోర్నమెంట్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈసారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్న అన్ని జట్లు ప్రమాదకరంగానే ఉన్నాయని, కానీ వాటన్నింటిలోకీ భారత్ మరింత డేంజరస్ టీమ్‌గా కనిపిస్తోందని ధోని అభిప్రాయపడ్డారు. మన కుర్రాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని చెప్పారు.

Read Also: Maharashtra: క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

View this post on Instagram

A post shared by Jatin Sapru (@jatin_sapru)

ఇలాంటి సమయంలో టాస్‌ కీలక పాత్ర పోషిస్తుంది

పొట్టి ఫార్మాట్ లో ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, భారత జట్టులోని ఆటగాళ్లు అందరికీ ఒత్తిడిలో ఆడిన అనుభవం పుష్కలంగా ఉందని అన్నారు. ఎవరు ఏ పాత్ర పోషించాలో జట్టులోని సభ్యులకు స్పష్టంగా తెలుసని ధోనీ చెప్పారు. మంచి జట్టుకు ఉండాల్సిన లక్షణాలన్నీ టీమ్‌ ఇండియాలో ఉన్నాయని వివరించారు.మ్యాచ్ జరిగే వేదికల్లో వాతావరణం తనను కలవరపరుస్తోందని ధోనీ చెప్పారు.

శీతాకాలం కావడంతో కొన్ని నగరాల్లో మంచు కురుస్తోందని, మ్యాచ్ పై దీని ప్రభావం చాలా ఉంటుందని వివరించారు. ఇది చాలా విషయాలను ప్రభావితం చేస్తుందని, తాను ఆడుతున్న సమయంలోనూ డ్యూ (మంచు) అంటే భయాందోళనలకు గురయ్యానని చెప్పారు. ఇలాంటి సమయంలో టాస్‌ కీలక పాత్ర పోషిస్తుందని ధోని చెప్పుకొచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Indian Cricket Team latest news MS Dhoni T20 World Cup Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.