T20 WC 2026: టీ20 ప్రపంచకప్ సూపర్-8 ఉత్కంఠ కొనసాగుతోంది. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈరోజు జరుగుతున్న కీలక మ్యాచ్‌లో శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా పిచ్‌పై తేమ ఉండే అవకాశం ఉన్నందున, ఆరంభంలో బౌలర్లకు లభించే సహకారాన్ని అందిపుచ్చుకోవాలని లంక భావిస్తోంది.
Read Also: PAK vs NZ rain match : వర్షం షాక్, రద్దైన మ్యాచ్‌తో పాక్ సెమీస్ ఆశలు డేంజర్
టాస్ గెలిచిన అనంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ షనక మాట్లాడుతూ.. “మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. గత కొన్ని మ్యాచ్‌లుగా ఛేదనలో రాణిస్తున్నాం. ఇక్కడ ఆడటంపై మా కుర్రాళ్లు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు” అని తెలిపాడు. గాయాల సమస్యలు ఉన్నప్పటికీ, వారి స్థానంలో వచ్చిన ఆటగాళ్లు బాగా రాణించారని చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చేసినట్లు, చమీర, కమిల్ మిషారా తుది జట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. “మేము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం. ధైర్యంగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలి. గతంలో ఇక్కడి పిచ్‌పై ఆడిన అనుభవం మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది” అని అన్నాడు. పిచ్‌ను త్వరగా అంచనా వేసి, దానికి తగ్గట్టుగా ఆడతామని, ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశాడు.
రెండు జట్ల వివరాలు
శ్రీలంక (తుది జట్టు): పతుమ్ నిస్సంక, కమిల్ మిషారా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మధుశంక.
ఇంగ్లండ్ (తుది జట్టు): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), శామ్ కరన్, విల్ జాక్స్, జేమీ ఒవర్‌టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: