📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 WC 2026: టీమిండియాకు పాంటింగ్ కీలక సూచనలు

Author Icon By Anusha
Updated: February 25, 2026 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

T20 WC 2026: టీ20 ప్రపంచకప్‌ సూపర్-8 పోరులో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలవ్వడంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు యాజమాన్యం అనుసరిస్తున్న ‘మ్యాచ్-అప్స్’ (ప్రత్యర్థి ఆటగాళ్లను బట్టి టీమ్ ఎంపిక) వ్యూహాన్ని ఆయన తప్పుబట్టారు. కేవలం ప్రత్యర్థి బ్యాటర్ల శైలిని బట్టి కాకుండా, జట్టులోని అత్యుత్తమ 11 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగాలని ఆయన సూచించారు.

Read Also: T20 World Cup 2026: స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ.. వైరల్ అవుతున్న వీడియో

అక్షర్ పటేల్ స్థానంలో సుందర్.. విఫలమైన వ్యూహం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారనే కారణంతో, భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను తప్పించి వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఈ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.తొలుత దక్షిణాఫ్రికా 187 పరుగులు చేయగా, ఛేదనలో భారత జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో టోర్నమెంట్‌లో భారత్ తొలి పరాజయాన్ని చవిచూసింది.’ది ఐసీసీ రివ్యూ’ కార్యక్రమంలో పాంటింగ్ మాట్లాడుతూ. “ప్రత్యర్థి జట్టులో లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారనే కారణంతో అక్షర్‌ను ఆడించలేదని కామెంటరీలో చెప్పారు.

T20 WC 2026: Ponting’s key advice for Team India

కెప్టెన్ నైపుణ్యమే ముఖ్యం.. పాంటింగ్ చురకలు

కానీ, జట్టులో రైట్ హ్యాండర్లు కూడా ఉన్నారు కదా. సరైన సమయంలో అక్షర్‌ను ఎలా ఉపయోగించుకోవాలనేది కెప్టెన్ నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది” అని వ్యాఖ్యానించాడు. కేవలం మ్యాచ్-అప్‌ల కోసం కీలక ఆటగాడిని పక్కనపెట్టడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు.ఈ ఓటమి భారత నెట్ రన్ రేట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తదుపరి చెన్నైలో జరగనున్న మ్యాచ్‌లో భారత జట్టు ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలని పాంటింగ్ సూచించాడు. “నేనైతే పరిస్థితులకు తగిన అత్యుత్తమ జట్టు ఏది అని మాత్రమే ఆలోచిస్తాను. అందులో అక్షర్ పటేల్ ఉన్నా ఫర్వాలేదు. లేదా కుల్దీప్ యాదవ్‌ను తిరిగి తీసుకురావడం గురించి కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే రిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్‌కు లెఫ్ట్, రైట్ హ్యాండర్లతో సంబంధం లేదు. అతను ఇద్దరినీ ఇబ్బంది పెట్టగలడు” అని పాంటింగ్ విశ్లేషించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Axar Patel vs Washington Sundar India vs South Africa Ricky Ponting T20 World Cup 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.