T20 WC SL vs NZ: శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం: టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక ప్రస్థానం ముగిసింది. సూపర్-8 పోరులో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంక 61 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ వరుసగా రెండో ఓటమితో లంక సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
Read Also: Rinku Singh: తండ్రికి క్యాన్సర్.. అయినా జట్టు కోసం చెన్నైకి చేరుకున్న రింకూ
రచిన్ రవీంద్ర స్పిన్ మాయ
న్యూజిలాండ్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కివీస్ బౌలర్ల ధాటికి తలవంచింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక బ్యాటర్లలో కమిందు మెండిస్ (31), వెల్లలాగే (29) మినహా మిగతా వారెవరూ కనీసం పోరాట పటిమ కనబరచలేదు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా, మ్యాట్ హెన్రీ 2, శాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు.
T20 WC SL vs NZ: కివీస్ ఘనవిజయం
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో సఫలమైంది. పక్కా ప్రణాళికతో బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించిన కివీస్, లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసి సెమీస్ దిశగా అడుగులు వేసింది.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: