T20 WC 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశ క్లైమాక్స్‌కు చేరుకుంది. కొలంబోలోని ప్రసిద్ధ ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇంగ్లండ్ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకోవడంతో ఈ మ్యాచ్ ఫలితం ఆ జట్టుపై పెద్దగా ప్రభావం చూపకపోయినా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. మరోవైపు, న్యూజిలాండ్‌కు ఇది అత్యంత కీలకమైన ‘డూ ఆర్ డై’ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కివీస్ సెమీస్ రేసులో నిలుస్తుంది.
Read Also: Rinku Singh Father Death: క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
ఊపు మీద ఇంగ్లండ్.. హ్యారీ బ్రూక్ సెన్సేషన్
ఈ టోర్నీలో ఇంగ్లండ్ జట్టు అజేయంగా దూసుకుపోతోంది. గ్రూప్ దశ నుంచి సూపర్-8 వరకు వరుస విజయాలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా శ్రీలంకపై 51 పరుగుల భారీ విజయం, ఆ తర్వాత పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో అద్భుతమైన ఛేజింగ్ ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. గత మ్యాచ్‌లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒత్తిడిలోనూ అద్భుతమైన సెంచరీ బాది, టీ20ల్లో తన సత్తా ఏంటో చాటాడు. బౌలింగ్‌లోనూ మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు.
మరోవైపు, న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. పాకిస్తాన్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా, శ్రీలంకపై 61 పరుగుల తేడాతో గెలిచి నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడితే మాత్రం పాకిస్తాన్‌కు అవకాశాలు మిగిలే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇంగ్లండ్ జట్టు అంచనా
ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్, జాకబ్ బేతెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
న్యూజిలాండ్ జట్టు అంచనా
టిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్‌కాన్చీ, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: