T20 WC 2026: భారత్ ఓటమిపై పగలబడి నవ్విన పాక్ మాజీ పేసర్

Read Time:  1 min
T20 WC 2026: భారత్ ఓటమిపై పగలబడి నవ్విన పాక్ మాజీ పేసర్
FONT SIZE
GET APP
T20 WC 2026: Former Pakistan pacer bursts into laughter after India's defeat
T20 WC 2026: Former Pakistan pacer bursts into laughter after India’s defeat

T20 WC 2026: ICC టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. సూపర్‌-8లో భాగంగా, తొలి పోరులో టీమ్‌ఇండియా 76 పరుగుల తేడాతో సఫారీల చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. గ్రూపు దశలో అపజయమెరుగని సూర్యకుమార్‌యాదవ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా.. కీలకమైన సూపర్‌-8లో తేలిపోయింది. 

Read Also: NaraLokesh: విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభం

భారత్ సెమీస్ చేరడం కష్టమేనని తాను చేసిన వ్యాఖ్యలు నిజమయ్యే సూచనలు కనిపించడంతో పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అనంతరం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో యాంకర్ తనను ‘జ్యోతిష్కుడు’ అని సంబోధించడంతో అమీర్ పగలబడి నవ్వాడు.

‘జ్యోతిష్కుడు’ అని పిలిచిన యాంకర్.. అమీర్ రియాక్షన్ వైరల్

మ్యాచ్ అనంతరం పాకిస్థాన్‌కు చెందిన ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చలో యాంకర్ అమీర్‌ను పరిచయం చేస్తూ, “మన జట్టు చేయలేనిది, మన ప్యానలిస్టులు స్టూడియోలో కూర్చొని చేస్తున్నారు. అమీర్ మొదట అభిషేక్ శర్మను ‘స్లాగర్’ అన్నాడు. అప్పటి నుంచి అతను ఫామ్‌లో లేడు. ఇప్పుడు భారత్ సెమీస్ ఆడదని చెప్పాడు. అది కూడా నిజమయ్యేలా ఉంది. జ్యోతిష్కుడు, క్రికెటర్ అయిన అమీర్‌కు స్వాగతం” అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు విన్న అమీర్ నవ్వుతూ, “నన్ను ఏమనుకుంటున్నారు? దేవుడా నన్ను క్షమించు (క్యా బనా దియా హై ముఝే? అల్లా మాఫ్ కరే)” అంటూ సరదాగా స్పందించాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.