T20 WC 2026: ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డు

Read Time:  1 min
T20 WC 2026: ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డు
FONT SIZE
GET APP

T20 WC 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియాకు ఊరట విజయం లభించింది. టోర్నీ ప్రారంభ దశలో దారుణంగా ఆడి సూపర్-8కి ముందే నిష్క్రమించిన ఆసీస్, తమ ప్రస్థానాన్ని ఒక ఘనమైన విజయంతో ముగించింది. శుక్రవారం పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఒమన్‌పై 9 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. 

Read Also: India terror conspiracy news : చంచల్‌గూడ జైలు నుంచే కుట్ర? హైదరాబాద్‌లో లష్కరే యత్నం

T20 WC 2026: All-rounder Maxwell sets a rare record
T20 WC 2026: All-rounder Maxwell sets a rare record

ఐదో క్రికెటర్‌

ఈ మ్యాచ్ లోనే , ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.T20Iలలో 2,000 రన్స్, 50 వికెట్లు తీసి, 50 క్యాచ్‌లు పట్టిన ఐదో క్రికెటర్‌గా నిలిచారు. ఇవాళ ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించారు. గతంలో నబీ(AFG), సికందర్(ZIM), హార్దిక్(IND), వీరందీప్ సింగ్(మలేషియా) ఈ ఫీట్ నమోదు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.