2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కి మందు ఇంటర్నేషనల్ క్రికెట్ మండలి (ఐసీసీ)తో పాటు భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కు షాక్ తగిలింది. ఇప్పటి వరకు టీమ్ఇండియా మ్యాచ్‌లకు స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌గా ఉన్న జియోహాట్‌స్టార్.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే T20 ప్రపంచ కప్ 2026కి ముందు జియోహాట్‌స్టార్ తన ఐసీసీ ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల ఒప్పందం నుంచి ముందుగానే వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: Puducherry: కోచ్‌పై బ్యాట్‌తో దాడి చేసిన ముగ్గురు ఆటగాళ్లు
దీంతో టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ ఇప్పుడు కొత్త భాగస్వాములను వెతకాల్సి ఉంది.అయితే, ICC బ్రాడ్‌కాస్టింగ్ నుంచి JioHotstar తప్పుకోడానికి గల కారణాలు ఇవే అని తెలుస్తోంది.! దీనికి పలు కారణాలు చూస్తే ఒక్కో మ్యాచ్‌కు జియో ₹138Cr చెల్లిస్తోంది. ఇది IPL మ్యాచ్ (₹114 Cr) కంటే ఎక్కువ. మరోవైపు 179 ICC మ్యాచ్‌లలో భారత్ 28 మాత్రమే ఆడుతోంది. మిగతా దేశాలవి అయితే వ్యూవర్‌షిప్, యాడ్ రెవెన్యూ తక్కువ వస్తాయి. కాగా ఇప్పుడు బలమైన పోటీదారు లేకపోవడంతో ప్రైస్ తగ్గించి తమకే కాంట్రాక్టు ఇస్తారని జియో భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: