T World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో ఓ భారీ సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్, పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు సూపర్-8 దశకు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. జింబాబ్వే, ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దు కావడం ఆసీస్ అవకాశాలను దెబ్బతీసింది. మ్యాచ్ రద్దుతో జింబాబ్వే, ఐర్లాండ్ జట్లకు చెరో పాయింట్ లభించింది.
Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి
3 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది
దీంతో జింబాబ్వే పాయింట్ల పట్టికలో 5 పాయింట్లకు చేరుకుని సూపర్-8లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.గ్రూప్-బిలో ఇప్పటికే శ్రీలంక 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, జింబాబ్వే 5 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. దీంతో 2021 ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్‌లో గెలిచినా గరిష్ఠంగా 4 పాయింట్లను మాత్రమే అందుకోగలదు. ఈ సమీకరణాలతో మిచెల్ మార్ష్ నేతృత్వంలోని జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయమైంది.
ఆసీస్ వరల్డ్ కప్ లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించడం 17 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.ఈ మ్యాచ్ రద్దు ఆస్ట్రేలియాకే కాకుండా ఐర్లాండ్‌కు కూడా చేదువార్తను అందించింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడి, ఒమన్‌పై 96 పరుగుల భారీ విజయంతో రేసులోకి వచ్చిన ఐర్లాండ్.. సూపర్-8 ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. కానీ వర్షం కారణంగా కేవలం ఒక పాయింట్‌తోనే సరిపెట్టుకుని, మొత్తం 3 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: