📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

Latest News: Suryakumar Yadav: ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఏమన్నారంటే?

Author Icon By Aanusha
Updated: October 31, 2025 • 9:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజెల్‌వుడ్ (Josh Hazelwood) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియాపై గెలుపు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ విజయంలో హజెల్‌వుడ్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది.

Read Also: Tejpal Singh:కబడ్డీ క్రీడాకారుడిని కాల్చి చంపిన దుండగులు

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మాట్లాడుతూ — “మా ఓటమికి ప్రధాన కారణం జోష్ హజెల్‌వుడ్ బౌలింగ్. ‘జోష్ హజెల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు తీసి మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీసాడు. అభిషేక్ శర్మకు కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే అభిషేక్ చాలా రోజులుగా తన జోరును కొనసాగిస్తున్నాడు.

అతనికి తన ఆట ఏంటో, తన గుర్తింపు ఏంటో తెలుసు. ఆ పేరు చెక్కుచెదరకుండా రాణిస్తున్నాడు. అతను ఇదే జోరు కొనసాగిస్తాడని, మా కోసం ఇలాంటి ఇన్నింగ్స్‌లు మరెన్నో ఆడుతాడని ఆశిస్తున్నాం. మేం తొలి మ్యాచ్‌లో ఎలా ఆడామో అలానే ఆడాలనుకుంటున్నాం. ముందుగా బ్యాటింగ్ చేస్తే బాగా ఆడాలి.

Suryakumar Yadav

ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా

ఆపై వచ్చి ఆ లక్ష్యాన్ని కాపాడుకోవాలి.’అని సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చెప్పుకొచ్చాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. హర్షిత్ రాణా(33 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35) అతనికి అండగా నిలిచాడు.

మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవలేదు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/13) మూడు వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు తీసారు. మార్కస్ స్టోయినీస్ ఒక వికెట్ తీసాడు.

కాస్త కట్టడిగా బౌలింగ్ చేసినా

పరిస్థితులను గౌరవించకుండా దూకుడుగా ఆడి భారత బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు.అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ మిచెల్ మార్ష్(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ట్రావిస్ హెడ్(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) దూకుడుగా ఆడాడు.

భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/26), వరుణ్ చక్రవర్తీ(2/23), కుల్దీప్ యాదవ్(2/43) రెండేసి వికెట్లు తీసారు. పవర్ ప్లేలో కాస్త కట్టడిగా బౌలింగ్ చేసినా.. బ్యాటింగ్‌లో మరో 20 పరుగులు చేసినా ఫలితం మరోలా ఉండేది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

India vs Australia Josh Hazlewood latest news Suryakumar Yadav T20 Series Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.